A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొడాలి నాని రెడ్డిగా మారిపోయారా- చంద్రబాబు వ్యాఖ్య
Share |
September 20 2020, 12:14 am

మంత్రి కొడాలి నాని ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆయనే స్వయంగా కుల ప్రస్తావన తేవడం విశేషంగా ఉంది. వెలుగు పత్రిక లో వచ్చిన ఒక వార్తా కదనం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇలా అన్నారు. జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాటాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి అని ఆయన అన్నారు. వైసిపి నేతలు దోపిడీలు చేసి పైకి వచ్చారని ఆయన విమర్శించారు. అమరావతికి మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని విమర్శించడం తగదని అన్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన మంత్రి కొడాలి నానికి రాజదాని బాధ్యత లేదా అని ఆయన అన్నారు. వైసిపిలో ఉన్నంత మాత్రాన కొడాలి నాని రెడ్డిగా మారిపోయారా అని కామెంట్ చేశారని ఆ పత్రికలో రాశారు. అమరావతి ప్రాంత వాసులు సహాయ నిరాకరణ చేయాలని, వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు ,మంత్రులకు సహకరించవద్దని సూచించారు.

tags : kodali nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info