A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గ్రామాల సర్పంచ్ లు పట్టణాలలోనే ఉంటున్నారు
Share |
September 20 2020, 12:03 am

గ్రామ స్వరాజ్యం రావాలంటే ఎన్నికల్లో డబ్బు, కుల, మత ప్రభావం ఉండకూడదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల అధికారులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషనర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. ఎన్నికల కమిషనర్ల సమావేశానికి ఆయన ప్రసంగించారు.ప్రస్తుతం గ్రామాల నుంచి యువకులు, ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారని, ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి ఎన్నిక అవుతున్నారన్నారు. అనంతరం పట్టణాలకే పరిమితం కావడంతో గ్రామాలు అభివృద్ధి జరగడం లేదని తెలిపారు.

tags : kishanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info