A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ -ఆంబోతు భాష- బొత్స వ్యాఖ్య
Share |
September 19 2020, 11:08 pm

మాజీ మంత్రి లోకేష్ కన్నా ఆంబోతు ఎవరు ఉన్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంబోతు ప్రభుత్వం అని ఆయన అంటున్నాడని, ఆయన భాష ఇలా ఉంటే తాము మాట్లాడలేమా అని ఆయన అన్నారు. లోకేష్ మాదిరి అచ్చేసిన అంబోతు ఇంకెవరు ఉంటారని ఆయన అన్నారు. అనవసరంగా ఏది పడితే మాట్లాడి ,అనిపించుకోవద్దని బొత్స సలహా ఇచ్చారు. తాము లోకేష్ వలే తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాలలో లేమని, తామంతా ప్రజలు ఎన్నుకుంటే నేతలం అయ్యామని బొత్స అన్నారు.లోకేష్ మంచి భాష నేర్చుకోవాలని ఆయన సూచించారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info