A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ అంటే చంద్రబాబుకు అందుకే ద్వేషం
Share |
September 20 2020, 12:13 am

ముఖ్యమంత్రి జగన్ అంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ద్వేషం అని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ లేకపోతే తనకు అదికారానికి ఎదురు లేదని చంద్రబాబు అనుకున్నారని, అందుకే ఆయనను అడ్డు లేకుండా చేసుకునేందుకు కుట్ర పన్ని జైలుకు పంపించారని పోసాని అన్నారు. అయినా జగన్ తన పట్టు వీడకుండా ప్రజలలో తిరిగి వారి ప్రేమ చూరగొని అదికారం సాదించారని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వానికి అయినా విధానాలు ఉంటాయని ఆయన అన్నారు. రాజధాని కి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని, ఆ డబ్బుతో మూడు చోట్ల వివిధ ప్రాజెక్టులు చేపట్టవచ్చని భావిస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఈ విదానం నచ్చకపోతే చంద్రబాబు కాని, ఆయన పార్టీ వారు కాని ఆందోళనలకు దిగడం సరికాదని ఆయన అన్నారు.కావాలంటే చంద్రబాబు ఆమరణ దీక్ష చేయవచ్చని ఆయన సూచించారు. చంద్రబాబు అప్పట్లో డబ్బు ఎలా వృదా చేశాడో చూశామని ఆయన అన్నారు. కాగా పృద్వీ రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

tags : posani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info