A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు తమిళనాడు ముఖ్యమంత్రి ధాంక్స్
Share |
September 19 2020, 11:19 pm

తమిళనాడు రాజధాని చెన్నైకి నీటి సమస్య ఏర్పడినప్పుడు తెలుగు గంగ ద్వారా నీటిని విడుదల చేసి ఆదుకున్నందుకు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిసామి ధన్యవాదాలు తెలిపారు. ఇంతవరకు కృష్ణానది నుంచి తెలుగుగంగ పథకం కింద నాలుగు టీఎంసీల నీరువచ్చింది. గత ఏడాది వేసవిలో తీవ్రమైనకరువు పరిస్థితులు నెలకొనగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రులు స్వయంగా కలుసుకుని తెలుగుగంగ పథకం కింద తమిళనాడుకు కేటాయించిన నీటిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలుగుగంగ నీటితో గ్రేటర్‌ చెన్నై ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. తమ కోర్కెను మన్నించి సకాలంలో సహకరించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

tags : palanaisami

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info