A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి జెఎసి ఆఫీస్ కు తాళం
Share |
September 19 2020, 11:21 pm

విజయవాడలో వేదిక కళ్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అత్యంత రద్దీగా ఉండే ఆ ప్రదేశం నుంచి కార్యాలయం తరలించాలని వారు ఆదేశించారు.కార్యాలయం కోసం ఇచ్చిన బవన యజమానికి పోలీసులు నోటీసు ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వచ్చి కల్యాణ మండపం గేటుకు తాళాలు వేశారు. కార్యాలయానికి ఎలా అనుమతిచ్చారని మేనేజర్ ను ప్రశ్నించారు. వెంటనే ఖాళీ చేయించాలని చెప్పారు. గురువారం ఉదయం చంద్రబాబు కార్యాలయానికి వస్తున్నారని తెలిసి పోలీసులు తిరిగి తాళాలు ఇచ్చి ఒక్కరోజే నడపాలని.. శుక్రవారం నుంచి అనుమతి లేదని తెలిపారట. గురువారం ఉదయం 8 గంటలకు ఒక నోటీసు ఇచ్చి , రాత్రికి తాళాలు వేశారని తెలుగుదేశం మీడియా వార్త ఇచ్చింది.

tags : amaravati, lock

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info