A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి ఎదురు దెబ్బ
Share |
September 20 2020, 12:21 am

మహారాష్ట్రలో బిజెపికి మరో ఎదురు దెబ్బ తగిలింది.అక్కడ జరిగిన ఆరు జిల్లా పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్, ఎన్సిపి, శివసేన కూటమి నాలుగు గెలుచుకోగా, ఒకటి మాత్రమే బిజెపి దక్కింది. మరో జిల్లా పరిషత్ ప్రకాష్ అంబేద్కర్ పార్టీ అయిన శోషిత్ బహుజన సమాజ్ పార్టీ గెలిచింది. వీటిలో కూడా బిజెపికి అతి ప్రతిష్టాత్మకమైన నాగపూర్ జడ్పి స్తానం కోల్పోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. నాగపూర్ ప్రాంతం బిజెపికి కంచుకోటగా పరిగణిస్తారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో పాటు కేంద్ర మంత్రి గడ్కరికి బలమైన ప్రదేశంగా చెబుతారు. అలాంటి చోట బిజెపి ఓడిపోయి కాంగ్రెస్,ఎన్సిపి కూటమి విజయం సాదించింది. మూడు జడ్పిలు ఇంతవరకు బిజెపి అదీనంలో ఉండగా, వాటిని కోల్పోయింది. అయితే ఒక జడ్పి చైర్మన్ పదవిని మాత్రం పొందగలిగింది

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info