A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వెగటుగా ఉంటున్నాయా
Share |
August 5 2020, 4:54 am

రాజకీయాలలో ఏమి మాట్లాడినా సందర్భోచితంగా ఉండాలి.రాజకీయ నేతగా ఉన్నప్పుడు కొ్నని విలువలతో మాట్లాడాలి.అందులోను సున్నితమైన అంశాలలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.కాని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు జనంలో విపరీతమైన వెగటు పుట్టిస్తున్నాయి. ఆయన ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని ,చంద్రబాబు తరపున మాట్లాడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలు సంగతి ఎలా ఉన్నప్పట్టికీ ,శంషాబాద్ వద్ద జరిగిన దిశ ఘటనపై చేసిన వ్యాఖ్యలు మరింత బాద్యతారాహితంగా ఉన్నాయి. దానికన్నా ముందుగా ముఖ్యమంత్రిగా జగన్ ను గుర్తించబోనని అంటున్నారు. ఇది మరీ దారుణంగా ఉంది.ప్రజాస్వామ్యం లో ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా పరిగణనించను అని ఏ నేత అయినా చెబుతారా?అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదా? లేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునే పవన్ ఇంకా సి.ఎమ్ గా భావించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ మాట ద్వారా ఆయన తన ద్వేషాన్ని మరింత బహిరంగంగా చెప్పినట్లయింది. అక్కడితే ఆగలేదు. జగన్ ను ఉద్దేశించి మతపరమైన విమర్శలు చేసిన తీరు మరీ అసహ్యంగా ఉంది.పనవ్ ఏమి అన్నారో చూడండి. .

జగన్ రెడ్డి గారికి మళ్లీ చెబుతున్నా మతం కావాలి అంటే కులాన్ని వదిలేయండి.
కులం హిందూయిజంలో మాత్రమే ఉంటుంది. క్రిస్టియానిటీలో ఉండదు. జార్జిబుష్
రెడ్డి అని పిలుస్తామా? మీరు చెప్పినట్టు మా కులం మాట తప్పదు అంటే మిగిలిన
కులాలు మాట తప్పుతాయా? ఇది పవన్ అన్న మాట . జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాని, ఇప్పుడు అదికారంలోకి వచ్చిన తర్వాత కాని కులం,మతం గురించి ఎక్కడైనా మాట్లాడారా? అయినా జగన్ ను ఉద్దేశించి పవన్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే ఆయనలో ఎంత ప్రస్టేషన్ ఉంది అర్దం చేసుకోవచ్చు. రాష్ట్రం అంతా ఒక్క సీటు మినహా, జనసేనను చిత్తు,చిత్తుగా ఓడించడం తో ఆయన లో నిరాశ అలముకుని ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగుదేశం మీడియా తనకు విస్తారంగా ప్రచారం చేస్తుందన్న భావనతో పవన్ ఏది బడితే అది మాట్లాడుతున్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమి కావాలి. జగన్ తాను మాట తప్పనని చెబితే మిగిలిన కులాలు మాట తప్పుతాయా అని పవన్ అతి తెలివిగా ప్రశ్నించారు.
ఇక దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఏమన్నారో చూడండి.

‘వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ ఇది పవన్ కళ్యాణ్ ఇస్తున్న సందేశం. పార్లమెంటులో ఎమ్.పిలతో సహా దేశ ప్రజలంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన దారుణమైన ఘటనపై పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం బాద్యతతో కూడిన విషయమేనా?అందువల్లే ఆయన ప్రత్యర్దులుకాని, సామాన్య ప్రజలు సైతం గతంలో పవన్ చేసిన ప్రకటనలను ఉదహరిస్తున్నారు.గతంలో తన సోదరుడి కుమార్తె ఒక యువకుడిని ప్రేమించిన ఘటనలో గన్ పట్టుకుని తిరిగిన వైనం, అలాగే తన సోదరిపట్ల అనుచితంగా వ్యవహరించారన్న విషయం తెలియగానే కత్తితో బయల్దేరి చంపేద్దామనుకున్నానని ఆయన చెప్పిన విషయాలను ప్రజలు గుర్తు చేస్తున్నారు.మరి అదే తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న తీరు. విడాకులు తీసుకోకుండానే మరో మహిళతో సంబందాలు పెట్టుకున్నారన్న ఆరోపణలను చేస్తున్నారు. ఒక నాయకుడికి ఉండవలసిన నైతిక విలువలు లేవని మహిళలను అవమానించేలా పవన్ మాట్లాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.ఇలాంటి వాటికి పవన్ కళ్యాణ్ ఆస్కారం ఇస్తున్నారంటే అది తెలివైన లక్షణమేనా? ఇక చివరిగా ఆయన చెప్పిన మరో ప్రకటన మరింత ఆశ్చర్యంగా ఉంది. అదేమిటో చూడండి.

ప్రధాని మోడీ గారి దగ్గరకు వెళ్లి నేను ప్రత్యేక హోదా వ్యవహారంలో మీ
మనసు నొప్పించేలా మాట్లాడాను. ఇక నుంచి కలిసి పని చేద్దాం అంటే వైసిపి ఎక్కడ
ఉండేది అని ఆయన బెదిరిస్తున్నారు.తనకు తాను తెలివైన నేతను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీని, అమిత్ షాను పొగుడుతున్నారంటే దాని అర్దం ఏమిటి? బిజెపి ని వదలి తప్పు చేశామని చంద్రబాబు అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారా?
తన బలం గురించి ఎక్కువగా ఊహించి దెబ్బతిన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసిపికి బలం లేదని,అందుకే తన విశాఖ మీటింగ్ కు జనం వచ్చారని ఆయన ఆత్మ వంచన చేసుకుంటున్నారు. తెలుగుదేశం మీడియాలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పై చేస్తున్న విమర్శలు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారన్న ఆనందంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారనుకోవాలి.కాని అది శాశ్వతం కాదని ఆయన తెలుసుకోవాలి. ముందుగా రాజకీయాలు,ప్రజాస్వామ్య సూత్రాలు,విలువల గురించి తెలుసుకుని వాటిని పాటించడానికి ముందుగా పవన్ కళ్యాణ్ ప్రయత్నించాలి.లేకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ రాజకీయాలలో ఆరో వేలుగానే మిగిలిపోతారని చెప్పక తప్పదు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info