A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మద్య వ్యతిరేక ప్రచారం లో బిజెపి నేత
Share |
January 19 2020, 9:31 am

మాజీ మంత్రి ,బిజెపి నేత డి.కె. అరుణ మద్య వ్యతిరేక ప్రచారంలో బిజీ అయ్యారు. ఆమె నిరశన దీక్ష తర్వాత ఆయా చోట్ల పర్యటించి మద్యానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తున్నారు.తాఆగా ఆమె నల్లగొండలో మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టపగలే లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఈ నేరాలకు ఏరులై పారుతున్న మద్యమే కారణమని అన్నారు. మద్యంపై నియంత్రణతో మొదలుపెట్టి నిషేధం వైపు అడుగులు వేయాలని అరుణ డిమాండ్‌ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో మద్య నిషేధం కోసం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అరుణ తెలిపారు. మద్యం విక్రయం ద్వారా వస్తున్న ఆదాయమే ప్రభుత్వానికి ప్రధాన వనరుగా మారిందని, ప్రజల రక్తాన్ని పీల్చుకొని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.

tags : dk aruna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info