A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు,లోకేష్ లు ఉద్యోగులను తిడతారా
Share |
January 19 2020, 11:32 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారిలో ఇంకా మార్పు రాలేదని, ఉద్యోగ సంఘాల మాజీ నేత, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. దుష్ట ఆలోచనలతోనే ఛీప్‌ మార్షల్‌, మార్షల్స్‌ పై దాడికి దిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడారని ఆయన విమర్శించారు. ఉద్యోగులపై దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, లోకేష్‌లు వ్యవహరించారని అన్నారు. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభలో గందరగోళం సృష్టించి.. ప్రజల్లో సానుభూతి పొందాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చూస్తున్నారన్నారు. అసూయ, ద్వేషం, అహంకారంతో రగిలిపోతున్న చంద్రబాబును ప్రజలు అరకొర మెజార్టీతో ప్రతిపక్షంలో కుర్చోపెట్టారన్నారు.

tags : ysr congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info