A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పట్టిసీమ ట్రాన్స్ పార్మర్ దగ్దం
Share |
January 19 2020, 11:10 am

పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోత స్కీమ్ వద్ద ఒక ట్రాన్స్ పార్మర్ దగ్దం అయిన తీరు కలకలం రేపింది.ఎత్తిపోత పదకానికి సంబందించి ఒక్కొక్కటి 220 కిలోవాట్ల ట్రాన్స్ పార్మర్లు మూడు ఉన్నాయి. వాటిలో నెంబర్ ఒన్ ట్రాన్స్ పార్మర్ దగ్దం అయింది. పట్టిసీమ ద్వారా గత పదిహేను రోజులుగా నీటి సరఫరా కూడా లేదు. అయినా ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది అర్దం కావడం లేదని అంటున్నారు. ఒక ట్రాన్స్ పార్మర్ పూర్తిగా దగ్దం కాగా, మిగిలిన వాటి పరిస్థితి తెలియవలసి ఉంది.విషయం తెలుసుకున్న పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని సబ్ స్టేషన్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక కేంద్రం కొవ్వూరులో ఉండడంతో అగ్నిమాపక ఆలస్యం కావడంతో వాహనం రావడం ఆలస్యం కావడంతో నష్టం ఎక్కువగా ఉందని అంటున్నారు.

tags : ap, pattiseema

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info