A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవినీతి అదికారిని సస్పెండ్ చేస్తే ...అంబటి
Share |
January 19 2020, 11:12 am

అవినీతికి పాల్పడిన అధికారిని సస్పెండ్ చేస్తే దానిని జాతీయ సమస్యగా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ,ఎల్లో మీడియా చిత్రీకరిస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పరిశ్రమల శాఖ ఐఆర్ఎస్ అదికారి జాస్తి కృష్ణ కిశోర్ పై పరిశ్రమల శాఖ నివేదికతోనే సస్పెన్షన్ చర్యను ప్రభుత్వంతీసుకుందని ఆయన తెలిపారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్‌ చేయకుండా సన్మానం చేస్తారా అని ప్రశ్నించారు.గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణ కిషోర్‌ తనకు అనుకూలంగా పనిచేయడం వల్లే ఇప్పుడు ఇలా గగ్గోలు పెడుతున్నారని ఆయన అన్నారు. తప్పు చేశారని ఆధారాలుంటే ఎంతటి అధికారులైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్‌, చంద్రబాబు కుట్రతోనే వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టారని పేర్కొన్నారు.

tags : ambati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info