A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ ఒంటి చేత్తో నాశనం చేస్తున్నారు-రాహుల్
Share |
August 5 2020, 4:13 am

కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో సభ ను నిర్వహించింది. ప్రదాని మోడీ విదానాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోతోందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ అన్నారు.ఆర్దిక వ్యస్తను మోడీ ఒంటి చేత్తో నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.దేశంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉల్లి ధర కిలో రూ. 200కు చేరింది. ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. దీనికి కారణం శత్రువులు కాదు.మోడీనే కారణమని ఆయన అన్నారు. మోడీని ఆర్దిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు. నోట్ల రద్దుతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని ఆయన అన్నారు. అదానీ, అంబానీలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ముట్టజెప్పారన్నారు. మోదీ విధానాల వల్ల ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయన్నారు తన పేరు రాహుల్ సావర్కర్ కాదని, రాహుల్ గాంధీ అని ఆయన అన్నారు. దేశం రేప్ ఇన్ ఇండియా అవుతోందన్న విమర్శను ఉపసంహరించుకోనని , క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని అన్నారు. దేశాన్ని నాశనం చేస్తున్నందుకు మోడీ,షాలే క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాందీ డిమాండ్ చేశారు.

tags : rahulgandhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info