A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భగ్గుమన్న ఈశాన్య రాష్ట్రాలు-కేంద్రం కొత్త తలనొప్పి
Share |
January 19 2020, 11:18 am

మళ్లీ ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. పౌరసత్వ చట్ట సవరణకు నిరసనలు పెల్లుబుకడంతో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆ దేశాల పౌరులకు అలెర్ట్ ప్రకటనలు పంపించాయి.భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించడానికి వెళుతున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేశాయి. అసోం, త్రిపురల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయి.గౌహతిలో కర్ఫ్యూ విధించారు. అసోంలోని కొన్ని జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అటు జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటన కూడా రద్దయింది.ఎన్.డి.ఎ. ప్రభుత్వం సడన్ గా తలనొప్పి తెచ్చుకుందా?

tags : india

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info