A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రివర్స్ టెండరింగ్ ద్వారా 1400 కోట్ల ఆదా
Share |
August 5 2020, 4:16 am

పారదర్శకత, జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ పై
శాససనభలో జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌


*దేశంలో ఇవాళ ఏ నాయకుడికైనా కష్టమైన పని అవినీతిని అదుపు చేయడం*
*అది చేయాలంటే ఒక నాయకుడికి ఒక ధైర్యం, చిత్తశుద్ది, నిజాయితీ ఉండాలి*
*ఈ రోజు భారతదేశంలోనే కరెప్షన్‌ అదుపుచేసేందుకు చర్యలు తీసుకుంటున్న వ్యక్తి సీఎం శ్రీ వైయస్‌. జగన్మోహన్‌ రెడ్డి గారే*

*పాలనలో పారదర్శకతే, అవినీతిరహిత పాలనే మా ప్రభుత్వ లక్ష్యం*

*జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకత, ప్రజాధనం ఆదా చేసాం*

*గత ప్రభుత్వ హయామంలో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగింది*
*రివర్స్‌ టెండరింగ్‌లో ఇప్పటివరకూ దాదాపు రూ. 1400 కోట్లు ఆదా**అసెంబ్లీ*:

ఈరోజు భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద వ్యాధి, ఆర్ధిక ప్రగతిని నిరోధించేది కరెప్షన్‌
ఈ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారు అధికారం చేపట్టగానే ప్రమాణ స్వీకారం రోజే, ట్రాన్స్‌ఫరెంట్‌ ప్రభుత్వం ఉండాలి, ప్రతీ వర్కులో జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఉండాలన్నారు
ప్రతీ ఒక్కటి పారదర్శకంగా ఉండాలని ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు
ఈ రోజు మనదేశంలో తీసుకుంటే రాజకీయాలల్లో ఒక నాయకుడికి, ఒక ముఖ్యమంత్రికి అతి కష్టమైన, ప్రమాకరమైన నిర్ణయం ఏంటంటే కరప్షన్‌ మీద ఉక్కుపాదం మోపటమే
అది తీసుకోవాలంటే ఒక నాయకుడికి ఒక ధైర్యం, చిత్తశుద్ది, నిజాయితీ ఉండాలి
ఒక డిటర్మనేషన్‌ ఉండాలి
ఈ రోజు భారతదేశంలోనే తీసుకుంటే ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెప్షన్‌ అదుపుచేసేందుకు చర్యలు తీసుకుంటున్న వ్యక్తి శ్రీ జగన్మోహన్‌ రెడ్డి గారే
ఈ రోజు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో వేలాది కోట్ల వర్కుల్లో అవినీతి జరిగింది
ఏ పనైనా 4శాతం ఎక్సెస్‌ వేసుకుంటూ వెళ్తున్నారు
రివర్స్‌ టెండరింగ్‌లో ఇప్పటివరకూ దాదాపు రూ. 1400 కోట్లు ఆదా అయ్యాయి.
పోలవరానికి సంబంధించి ఒక టన్నెల్‌లో మేక్స్‌ ఇన్‌ఫ్రా అనే కంపెనీ దాదాపు రూ.230 కోట్ల రూపాయలు వర్క్‌లోనే మనం 50 కోట్ల రూపాయలు వరకు రివర్స్‌ టెండరింగ్‌లో ఆదా చేయడం జరిగింది.
అదే వర్క్‌ గతంలో 4 శాతం ఎక్సెస్‌తో రావడం జరిగింది
పోలవరం ప్రాజెక్టు పై రివర్స్‌ టెండరింగ్‌కు వెళితే దాదాపు 750 కోట్ల రూపాయలు మిగుల్చుకోవడం జరిగింది
రూ.550 కోట్లకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు కూడా రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.67 కోట్లు మిగుల్చుకోవడం జరిగింది.
ఇదే కాకుండా మా జిల్లాలో ఆల్తూరు పాడు రిజర్వాయర్‌కు రివర్స్‌టెండరింగ్‌ పిలిస్తే రూ.250 కోట్లు వర్క్, గతంలో 4శాతం ఎక్సెస్‌ అయిన వర్క్‌కు రివర్స్‌టెండ్‌రింగ్‌కు వెళ్లాం.
దాదాపు 26శాతం లెస్‌ వేసి రూ.68 కోట్ల రూపాయలు ఆదా చేయడం జరిగింది.
నాలుగు హౌసింగ్‌ ప్రాజెక్టులకు రివర్స్‌టెండరింగ్‌ పిలిస్తే, దాదాపు 700 కోట్ల రూపాయలు పిలిస్తే 15–20 శాతం లెస్‌తో రూ.105 కోట్లు ఆదా చేయడం జరిగింది
ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయామంలో 4 శాతానికి తగ్గకుండా ఎక్సెస్‌ కోట్‌ చేశారు
వేల కోట్ల రూపాయలు అదనంగా కోట్‌ చేశారు
వెలిగొండకు సంబంధించి గతంలో రిత్వక్‌ కట్టబెట్టినవారు దాదాపు 4.5 శాతం రిత్విక్‌కు కట్టబెట్టినారు
అది కూడా రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొని 6.5శాతం లెస్‌కు వెళ్లారు
అదే నిన్న ఆల్తూరుపాడు గతంలో హెచ్‌సిఎస్‌ కంపెనీ 4.6 శాతం వేసిందో నిన్న దాదాపు 25 శాతం లెస్‌కు తగ్గించి వేయడం జరిగింది
ఏదేతే పోలవరం టన్నెల్‌కు సంబంధించి గతంలో 4 శాతం తీసుకున్న మేక్స్‌ ఇన్‌ఫ్రా ప్రస్తుతం 15శాతం లెస్‌కు తీసుకుంది
గత ప్రభుత్వం ఎవరికైతే 4 శాతం ఎక్సెస్‌కు కట్టబెట్టారో అవే కంపనీలు ఇప్పుడు 15 శాతం, 20 శాతం లెస్‌కు వేసే పరిస్ధితి ఉంది.
కేవలం 5–6 వేల కోట్ల రూపాయల పనుల్లో దాదాపు 1400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మిగిల్చ గలిగిందో.... ఈ 1400 కోట్ల రూపాయలు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మా ప్రభుత్వం మిగిల్చకపోయి ఉంటే ఆ డబ్బులు ఏ బాబు జేబులోకి పోయుండేవి అని ప్రశ్నిస్తున్నాను
కేవలం ఈ ఐదు మందికే ఈ 1400 కోట్లు మేం మిగల్చగలిగాం
కానీ ఈ 1400 కోట్లు రూపాయలు మా ముఖ్యమంత్రిగారు ఎన్నిసంక్షేమ పధకాలకు ఉపయోగించగలుగుతున్నాం
ఈ 1400 కోట్లు అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చి ఉంటే దాదాపు 20 లక్షల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండి ఉండేవి.
దాదాపు 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిఉంటే 20 లక్షల మంది రైతుల్లో వెలుగులు నింపవచ్చు
అవే డబ్బులతో అమ్మఒడి పథకం క్రింద 20 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చు

ఒక నీరు చెట్టు తీసుకుంటే దాదాపు 20 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు
హౌసింగ్‌ వంటి ఇతర ఫధకాల్లోనూ వేలకోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో దోచుకున్నారు
ఏ పధకంలోనైనా దోచుకోవడమే గత ప్రభుత్వ లక్ష్యం
మా ముఖ్యమంత్రిగారు కలెక్టర్లకు, ఎస్పీలకు మొదటి సమావేశంలోనే ఆదేశాలిచ్చారు
మంత్రులైనా, అధికారులెవరైనా కరెప్షన్‌కు చేస్తే సహించేది లేదన్నారు
గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ఫెన్సన్‌ కావాలన్నా, ఇళ్లు కావాలన్నా ఏ ప్రభుత్వ పధకం కావాలన్నా లంచమే.
అందుకే లంచాలు లేకుండా చేయడం కోసం గ్రామసెక్రటేరియట్‌లు ను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డిదే.
ఎవరైనా లంచం అడిగితే 14400 నంబరుకు ఫోన్‌ చేస్తే సదరు అధికారులు మీద వారి జిల్లాలకు సంబంధించిన ఏసీబీ అధికారుల ద్వారా 15 రోజుల్లోపే బాధితులకు న్యాయం చేయడం జరుగుతుంది.
అవినీతికి వ్యతిరేకంగా సినిమాలు తీస్తే... అలాంటి పాలన వస్తుందా అని జనాలు ఎదురుచూస్తున్నారు
ఆ భగవంతుడు జగ్మోహన్‌ రెడ్డి రూపంలో అలాంటి ముఖ్యమంత్రిని పంపించాడు.

జగనన్న ఎప్పుడూ అంటూ ఉంటారు దివంగత నేత అభివృద్ధి వైపు రెండడుగులు వేశారు ... నేను నాలుగడుగులు వేస్తానని..
కానీ ఆయన నాలుగు కాదు వంద కాదు అభివృద్ధి వైపు లెక్కలేనన్ని అడుగులు వేశారు అని గర్వంగా చెపుతున్నాను

tags : anil yadav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info