A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
Share |
January 24 2020, 10:18 am

కె. కృష్ణ సాగర్ రావ్.. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.


లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు 2019 కు వ్యతిరేకంగా trs ఎందుకు ఓటు వేసిందో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వివరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

తానే అందరి కంటే పెద్ద హిందు అని చెప్పుకొని తిరిగే కేసీఆర్ ఎందుకు హిందువులకు రక్షణ కల్పించే బిల్లును వ్యతిరేకించారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ , బంగ్లదేశ్ లలో మతపరమైన హింసతో బాధపడుతున్న లక్షలాది మంది హిందువులను రక్షించే బిల్లును లోకసభలో అడ్డుకున్న కెసిఆర్ తనకు తాను పెద్ద హిందువు ఎలా అవుతారు ?

పౌరసత్వ సవరణ బిల్లు 2019 ను రాజ్యసభలో కూడా అడ్డుకునేందుకు కెసిఆర్, ఆయన పార్టీ టిఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు 2019 ఒక చారిత్రాత్మక బిల్లు, ఇది లక్షలాది హిందూ శరణార్థులకు లైఫ్ లైన్ లాంటిది.

ఈ బిల్ ద్వారా మూడు
ఇస్లామిక్ దేశాలలో హిందు కుటుంబాలను బలవంతపు మత మార్పిడి, హింస , అణచివేత నుండి కాపాడవచ్చు. వారికి భారతదేశంలో పౌరసత్వ రక్షణ కల్పించవచ్చు.

తాను 'పెద్ద హిందువును' అని చెప్పుకొనే కేసీఆర్ వాదన నకీలిదని తేలిపోయింది.


వాస్తవానికి సీఎం కెసిఆర్‌కు తన సొంత మతం పై కూడ చిత్తశుద్ధి లేదని తేలిపోయింది.

కేసీఆర్ ఎజెండా కేవలం ఎన్నికల ఎజెండా మాత్రమే. మత సంతుష్టికరణ మాత్రమే ఆయన ఎజెండ.

టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రంలో మజ్లీస్, కాంగ్రెస్ పార్టీ యొక్క B- టీం గా బిజెపి భావిస్తోంది.

కేసీఆర్ మజ్లీస్ అధినేత అసద్దుద్దీన్ చేతిలో ఒక కీలు బొమ్మగా బీజేపీ భావిస్తుంది.

tags : krishnasagar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info