A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళా పోలీస్ వలంటీర్లు
Share |
August 5 2020, 4:21 am

మహిళా పోలీస్‌ వాలంటీర్లుతో మంచి ఫలితాలు*
*వైయస్‌ఆర్‌ కడప, అనంతపురంలో ఎంపీవీలు తీరు బావుంది*
*ఏలూరు, గుంటూరు, అనంతపురంలో యాంటీ ఉమెన్‌ క్రాఫ్ట్‌ యూనిట్స్‌*
కేంద్రప్రభుత్వ డబ్ల్యుసీ మంత్రిత్వశాఖ మహిళా పోలీస్‌ వాలంటీర్లు ప్రారంభించటం జరిగిందని హోమ్ మంత్రి ఎమ్.తెలిపారు. జెండర్‌ సమస్యలపై పోలీసులకు అందుబాటులో స్థానికంగా సాధికారితక గల సామాజిక అవగాహన మహిళలకు ఎంపీవీలుగా తీర్చిదిద్దటం జరిగిందని సుచరిత అన్నారు. ఎంపీవీలు మహిళలపై నేరాలను ఎదుర్కోవటానికి పబ్లిక్‌ పోలీస్ ఇంటర్‌ఫేస్‌గా సేవల్ని అందిస్తారు. గృహహింస, బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింసవంటివి నివేదించటం మహిళా పోలీస్‌ వాలంటీర్‌ కర్తవ్యంగా ఆమె అన్నారు. సమాజానికి వీరు ఆదర్శంగా ఉంటారన్నారు. వైయస్‌ఆర్‌ కడప, అనంతపురంలో ఎంపీవీలు తీరు చాలా బావుంది. ప్రస్తుతం ప్రతి జిల్లాల్లో 1500 మంది మహిళా పోలీస్‌ వాలంటీర్‌ పనిచేస్తున్నారు. ఏపీలో మానవ రవాణా నిరోధక యూనిట్లు ఏపీ మహిళాభ్యుదయం, శిశుసంక్షేమ శాఖ సభ్యులు, స్థానిక ఎన్జీఓల సభ్యుల సహకారంతో వ్యక్తుల రవాణా నిరోధించి అరికట్టడం, అవసరమైనప్పుడు ఏలూరు, గుంటూరు, అనంతపురంలో యాంటీ ఉమెన్‌ క్రాఫ్ట్‌ యూనిట్స్‌ ప్రకటించడం జరిగింది. పోక్సో నేరస్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని, పదేపదే అదే నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను నిర్భందించాలని యూనిట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేయటం జరిగిందని సుచరిత వివరించారు. అదే విధంగా పైలెట్ విధానంలో ప్రకాశం జిల్లా పోలీస్‌ స్టేషన్లల్లో ప్రాజెక్ట్ అభయ్‌ ప్రారంభించామన్నారు. ఈ ప్రాజెక్ట్ అభయ్‌ ప్రకారం రాత్రివేళల అవసరం ఉన్న మహిళలను తీసుకురావటానికి ఏర్పాటు చేయటం జరిగిందని హోంమంత్రి సుచరిత మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు.

tags : sucharita

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info