A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
Share |
January 24 2020, 10:46 am

రాయలసీమ ప్రాజెక్టులు మళ్లీ కళకళలాడుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.
‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరి సామర్థ్యాన్ని 44 క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. తెలుగు గంగ కెనాల్‌ను 11500 క్యూసెక్కుల నుంచి 18వేల క్యూసెక్కుల వరకు అభివృద్ధి చేయబోతున్నాం. ఎస్సార్‌బీసీ కెనాల్‌ను 21వేల క్యూసెక్కుల నుచి 31వేల వరకు, కేసీ కెనాల్‌ 12500 క్యూసెక్కుల నుంచి 35వేల క్యూసెక్కుల వరకు, అవుకు టన్నెల్‌ కెనాల్‌ 10 క్యూసెక్కుల నుంచి 30వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. హెచ్‌ఎన్‌ఎస్‌ కెనాల్‌ నుంచి 2100 క్యూసెక్కుల కూడానీరు పోవడం లేదు. దానిని ఆరు వేల క్యూసెక్కులకు పెంచుతాం. తెలుగు గంగ మెయిన్‌ కెనాల్‌ టు వైఎస్సార్‌ కడప సామర్థ్యాన్ని 3500 క్యూసెక్కుల నుంచి 8వేల క్యూసెక్కులకు తీసుకెళ్లతాం. గండికోట టు సీబీఆర్‌ లిఫ్ట్‌ను రెండువేల క్యూసెక్కుల నుంచి నాలుగువేల క్యూసెక్కులకు, గండికోట టు జీఏఎన్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ నాలుగు వేల నుంచి ఆరువేల క్యూసెక్కులకు తీసుకుపోయేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇవన్నీ ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో టెండర్లకు వెళుతాయి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్లీ ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న రాయలసీమగా ప్రాజెక్టులు, నీళ్లతో కళకళలాడుతుంది’ అని సీఎం జగన్‌ వివరించారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info