A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెలిగొండకు వెయ్యి కోట్లు ఇస్తాం-జగన్
Share |
August 14 2020, 11:13 am

రాయలసీమ ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వ పరిస్థితులను సీఎం జగన్‌ సభకు వివరించారు. ‘గోరుకల్లు ప్రాజెక్టు సామర్థ్యం 12.44 టీఎంసీలకుగాను ఎనిమిది టీఎంసీలు మాత్రమే నీరు వచ్చింది. గొల్లపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 1.91 టీఎంసీలకుగాను ఒక్క టీఎంసీ మాత్రమే నిల్వ ఉన్నాయి. అనంతపురం రియర్వాయర్‌లో 5 టీఎంసీలకుగాను 3 టీఎంసీలు, చిత్రవతిలో 10టీఎంసీలకుగాను 6.8 టీఎంసీలు నీళ్లు నిల్వ చేయగలిగాం. గండికోటలో 26.85 టీఎంసీలకుగాను 12 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. బ్రహ్మం సాగర్‌లో 17.97 టీఎంసీలకుగాను 6.9 టీఎంసీలు మాత్రమే స్టోర్‌ చేయగలిగాం. సరళసాగర్‌లో 3 టీఎంసీలకు ఒక్క టీఎంసీ మాత్రమే నిల్వ ఉంది. వెలిగోడు ప్రాజెక్టుకు నీళ్లు రావడం లేదని, మరమ్మతులు చేయమని గతంలో బాబు ప్రభుత్వంతో మొత్తుకున్నా వినిపించుకోలేదు’ అని తెలిపారు.

గత చంద్రబాబు సర్కారు చిత్తశుద్ధితో రాయలసీమలోని ప్రాజెక్టుల పనులు చేపట్టి ఉంటే.. ప్రాజెక్టులు నీళ్లతో నిండుకుండలా ఉండేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుల మరమ్మతు పనులు చేయించేందుకు, సమస్యలన్నీ అధిగమించేందుకు యుద్ధప్రాతిపదికన అడుగులు వేసిందని స్పస్టం చేశారు. ఆర్‌ అండర్‌ ఆర్‌ ప్యాకేజీలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గండికోట ప్రాజెక్టుకు సంబంధించి రూ. 980 కోట్లు గతంలో చంద్రబాబు సర్కారు విడుదల చేసి ఉండి ఉంటే.. ఈ రోజు 26 టీఎంసీల నీళ్లు నిల్వచేసి ఉండేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంకాకముందు 2004 నుంచి 2014 మధ్యకాలంలో జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరు-నగరి సుజల స్రవంతి) ప్రాజెక్టుకు రూ. 5వేల36 కోట్లు ఖర్చు చేశారని, హంద్రీనీవాకు సంబంధించి రూ. ఆరువేల కోట్లు ఖర్చు చేశారని, కానీ, చంద్రబాబు హయాంలో రూ. 198 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, కేవలం ఎన్నికలు వస్తుండటంతో హడావిడిగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పనుల కోసం 420 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఇంకా రూ. 980 కోట్లు అదనంగా ఇచ్చి ఉంటే గండికోట ప్రాజెక్టులో ఈపాటికి నీళ్లు ఉండి ఉండేవి కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమలోని ప్రాజెక్టులను చం ద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు.

యుద్ధ ప్రతిపాదికన చర్యలు..
రాయలసీమలోని ప్రాజెక్టులను వచ్చే జూన్‌ నాటికి నింపేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలకు సంబంధించి చర్యలు తీసుకున్నామని సీఎం జగన్‌ సభకు వివరించారు. గండికోట ప్రాజెక్టుకు సంబంధించి 980 కోట్లు విడుదల చేసేందుకు, వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మరో వెయ్యి కోట్ల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నమని తెలిపారు. ఈ సమస్యలన్ని అధిగమించి.. రాయలసీమలోని డ్యాములన్నీ నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

tags : jagan

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info