A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
Share |
August 14 2020, 10:56 am

నామినేటెడ్‌ పోస్టుల్లో యాభైశాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకే*
*స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగిలిన పదవులనూ భర్తీచేస్తాం*
*తుదిజాబితాను ఇదే శాసనసభలో విడుదల చేస్తాం*
*నామినేటెడ్‌ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభైశాతం, అందులో మహిళలకు 50 శాతం* *రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే*
*దీనిపై దేశంలోనే తొలిసారి చట్టంచేసిన అసెంబ్లీ మనదే*
*శాసనసభలో ముఖ్యమంత్రి*


నామినేటెడ్‌ పోస్టుల్లో రిజర్వేషన్లపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ మాట్లాడిన అంశాలు. ప్రశ్నోత్తరాల సమయంలో జోక్యంచేసుకుని సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి.చంద్రబాబుగారి పార్టీ వక్రీకరణ చేస్తోంది.
ఇంతగా వక్రీకరణ చేసే పార్టీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు.
నామినేటెడ్‌ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనం చేసిన ఏకైక సభ మనది. దేశ చరిత్రలోనే ఇలాంటి చట్టాన్ని మన సభ మాత్రమే చేసింది.
మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై చట్టం చేశాం.
నామినేటెడ్‌ పనుల్లో కూడా 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన ఏకైక రాష్టం మన రాష్ట్రం మాత్రమే. ఇందులో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు కల్పించాం.
రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న ఓసీలకు చెందిన వారైతేనే ఏఎంసీల పదవులు ఇచ్చే పరిస్థితి
అలాంటి మార్కెట్‌పోస్టుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం
కృష్ణాజిల్లాలో 19 మార్కెట్‌ కమిటీ పోస్టులు ఉంటే... అందులో 10 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం
మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవులతోపాటు, దేవాలయాల ఛైర్మన్ల పదవుల్లోనూ రిజర్వేషన్లు పాటిస్తున్నాం
ఎంతో పలుకుబడి ఉంటే తప్ప దేవాలయ ఛైర్మన్‌ పదవి వచ్చేదికాదు
దేవాలయాల ఛైర్మన్లు, సభ్యులకు సంబంధించి పదవుల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తున్నాం
మొన్నటిమొన్న డీసీసీబీలు, డీసీఎంఎస్‌లకు సంబంధించి 13 ఉంటే.. అందులో 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం.

జస్టిస్‌ ఎ.శంకరనారాయణ, శాశ్వత బీసీ కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌
జక్కంపూడా రాజా, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌
శ్రీమతి ఆర్కే రోజా, ఏపీఐఐసీకి ఛైర్మన్‌గా పెట్టాం.
ప్రముఖ వైద్యుడు చంద్రశేఖరరెడ్డిని, ఏపీ మెడికల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా పెట్టాం
చంద్రబాబుగారి అత్తగారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి లక్ష్మీపార్వతిగారికి తెలుగు అకాడమీ ఛైర్మన్‌ ఇచ్చాం
లక్ష్మీపార్వతిగారికి వాళ్లు ఏమీ ఇవ్వలేదు. కాని, మేం ఇచ్చాం
రామ్మెహన్‌ రావుగారికి వైస్‌ఛైర్మన్‌గా ఇచ్చాం
లక్ష్మమ్మగారికి వైస్‌ఛైర్మన్‌ ఇచ్చాం
ఏపీఎస్‌హెచ్‌సీ సెక్రటరీగా బి.సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌కు ఇచ్చాం
ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య గౌడ్‌గారిని నియమించాం.
భార్గవ రామ్మోహన్‌రావుగారు వైస్‌ఛైర్మన్‌గా నియమించాం.
ఏపీ స్టేట్‌మినిమమ్‌ వేజెస్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌గా రామ్మోహన్‌రావుగారు ఉన్నారు
ఏపీ ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా ఎం.డి.నౌమాన్‌గారు ఉన్నారు,
అబ్దుల్‌ రహీం అఫ్సర్‌ వైస్‌ఛైర్మన్‌గా ఉన్నారు
ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కార్పొరేషన్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా జియావుద్దీన్‌
బండి అర్జున్‌ మనోజ్‌కుమార్‌ వైస్‌ఛైర్మన్‌గా ఉన్నారు.
జేసీ శర్మను ఒన్‌మేన్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా పెట్టాం.
మధుసూదనరావును రెల్లికార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పెట్టాం
ఏపీ మాల వెల్ఫేర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా శ్రీమతి అమ్మాజీని పెట్టాం.
ఏపీ మాదిగ వెల్ఫేర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కొమ్మూరి కనకారావును నియమించాం.
మహిళా కమిషన్‌ ఛైర్మన్‌గా వాసిరెడ్డి పద్మను పెట్టాం.
ఇలా చెప్పుకుంటే.. పోతే, ఈ జాబితాలో చూస్తే.. సగానికిపైగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే ఉన్నారని అర్థం అవుతుంది.
అయినా ప్రతిపక్షానికి ఇది కనిపించదు.
ఇంకా 160కిపైగా ఛైర్‌పర్సన్‌ నామినేటెడ్‌ పోస్టులు పెండింగులో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక వాటన్నింటినీ కూడా భర్తీచేస్తాం.
తుదిజాబితా వచ్చే సరికి 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఉంటారు.
ఇదే చట్టసభలో ఆ జాబితా కూడా విడుదలచేస్తాం.
సగం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇస్తాం.

ఇక సలహాదారుల విషయానికొస్తే.. ఈ పదవులు నామినేటెడ్‌ పదువులు కావు.
ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని సలహాదారులుగా నియమిస్తారు.
వాళ్లు ఆయారంగాలకు సంబంధించి తమ సలహాలు సూచనలుద్వారా విలువ, సామర్థ్యాన్ని పెంచగలుగుతారని భావించి అలాంటివాళ్లను సలహాదారులుగా నియమిస్తారు.
ఈ పోస్టులు కూడా ఏడాదికో, రెండేళ్లకో ఉంటాయి.
చంద్రబాబుగారు కుటుంబరావు అనే వ్యక్తిని ఎందుకు తీసుకున్నారు.
మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే తీసుకున్నారని ఇవాళ నేను అనొచ్చు.
కాని నేను అలా అనదలుచుకోలేదు.
నేను ఇక్కడ కులాన్ని ప్రస్తావించదలుచుకోలేదు.
ఆయారంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే ఎవరైనా సలహాదారులుగా తీసుకుంటారు. అందుకే నేను దాని జోలికి పోవడంలేదు.
ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది మా ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతాం.

మా కేబినెట్లో సుమారు 60 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు.
5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే.. నలుగురు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారని గర్వంగా చెప్పగలుగుతాం.
ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరని ఎవరని అడిగితే.. దళిత మహిళ అని గర్వంగా చెప్పగలుగుతా.
పిల్లలకు చదువులు చెప్పించే విద్యాశాఖమంత్రి ఎవరని అడిగితే.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సురేష్‌ అని గర్వంగా చెప్పగలుగుతా.
రాష్ట్రంలో రెవిన్యూ మంత్రి ఎవరు అని అంటే.. సుభాష్‌ చంద్రబోస్‌గారు అని గర్వంగా చెప్పగలుగుతా.
ప్రతి అడుగులోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మాదేనని గర్వంగా చెప్పగలుగుతా.

tags : jagn,advisors

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info