A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
Share |
August 5 2020, 4:49 am

టీడీపీ హయాంలో ఎంత రుణమాఫీ చేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రుణమాఫీ హామీతో రైతులను మభ్యపెట్టారని తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో రకాలుగా హడావుడి చేశారని చెప్పారు. గత ప్రభుత్వం బ్యాంక్‌లు రైతులకు లోన్‌లు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. నీరు-చెట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి కూడా డిస్కమ్‌ నిధులు వాడారని మండిపడ్డారు.లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తామని,బంగారం రుణాలు కూడా మాఫీ చేస్తామని ప్రచారం చేసుకున్నారని, కాని జరిగింది ఏమటని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాటల వీడియోని ప్రదర్శించారు.

tags : buggana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info