A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
Share |
August 5 2020, 5:18 am

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇస్తే అది నీటి మీద మూట అని,అదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట అంటే రాతిమీద రాసిన శిలాశాసనం అని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కాకాణి గోవర్దనరెడ్డి అన్నారు.గతంలో ఏ హామీని నిలబెట్టుకోకుండా చంద్రబాబు రైతులను నానా ఇబ్బందులకు గురి చేశారని, కాని జగన్ మాత్రం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క క్లిక్ తో రైతులందరికి రైతు భరోసా నిదులు ఇచ్చారని ఆయన అన్నారు. గతంలో ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధర నాలుగు రూపాయలు ఉంటే ,దానిని తగ్గించాలని అడగడానికి చంద్రబాబు కనీసం అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని , కాని జగన్ ముఖ్యమంత్రి కాగానే వారికి విద్యుత్ చార్జీలు తగ్గించి చూపారని ఆయన అన్నారు. తమ నియోజకవర్గానికి జగన్ వచ్చినప్పుడు పొదలకూరు ప్రాంత రైతుల బోర్ ల సమస్య గురించి ప్రస్తావించిన వెంటనే జగన్ వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు.

tags : kakani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info