A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సీమకు వైఎస్ ద్రోహం చేశారట..చంద్రబాబు ఆరోపణ
Share |
January 24 2020, 10:50 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు భలే ఆరోపణ చేశారు. రాయలసీమకు ద్రోహం చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన కొత్త ఆరోపణ చేశారు. రాయలసీమకు ప్రాజెక్టులు అవసరం లేదని వైఎస్ అన్నారని చంద్రబాబు ఆరోపించారు. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు ఎన్.టి.ఆర్ శంకుస్థాపన చేస్తే, తన హయాంలో చాలా వరకు పూర్తి అయ్యాయని ఆయన చెప్పారు. నదుల అనుసందానానికి తామే కృషి చేశామని ఆయన అన్నారు.మాటలు కోటలు దాటుతున్నాయి.. పనులు గడప కూడా దాటడం లేదు. చిత్తూరు వరకు నీళ్లు తీసుకుపోయిన ఘనత మాదే. గ్రామ సచివాలయాల్లో 4లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? ఉద్యోగాలన్నీ వైకాపా కార్యకర్తలకే ఇచ్చారని ఆయన అన్నారుఅగ్రి గోల్డ్ బాధితులకు డబ్బు ఇవ్వడానికి తాము 336కోట్లు రూపాయలు సిద్దం చేశామని ఆయన అన్నారు.


ఎన్.టిఆర్ ఆయా ప్రాజెక్టులకు శ్రీ్కారం చుట్టిన మాట నిజమే.కాని చంద్రబాబు ఆ తర్వాత విస్మరించింది వాస్తవమే. ఆ తర్వాత వైఎస్ అదికారంలోకి వచ్చాకే మళ్లీ అవి పుంజుకున్నాయన్నది వాస్తవం. కాని చంద్రబాబు మాత్రం వైఎస్ ద్రోహం చేశారని అంటున్నారు.

tags : chadrnababu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info