A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిలో కేశినేని నాని వేరే దారి..కారణం ఏమిటో!
Share |
January 24 2020, 10:54 am

విజయవాడ టిడిపి ఎమ్.పి కేశినేని నాని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన తీరు ఆసక్తికరంగా ఉంది. మత ఆదారంగా పౌరసత్వం ఇవ్వజాలమని, మనది లౌకిక దేశం అని ఆయన అన్నారు. తన మనస్సాక్షిగా బిల్లును వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఎలాంటి కేసులు లేవని, తాను ఎవరికి భయపడే అవసరం లేదని ఆయన అన్నారు. ఆయన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారన్నఅబిప్రాయం వచ్చింది. కాని అంతిమంగా ఆయన ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మిగిలిన ఇద్దరు టిడిపి ఎమ్.పిలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు లు మాత్రం కేంద్రం బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వైసిపి ఎమ్.పిలు పార్టీ నిర్ణయం ప్రకారం అనుకూలంగా ఓటు వేయగా, టిడిపిలో ఒక ఎమ్.పి బిన్నంగా వ్యవహరించడం విశేషఃం.అయితే తనకు ఎవరూ అనుకూలంగా ఓటు వేయాలని చెప్పలేదని అంటున్నారు. ఇదిలా ఉండగా,టిఆర్ఎస్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించింది.

tags : kesineni nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info