A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రిజర్వాయర్ల లో నీళ్లు లేకపోవడంపై జగన్..
Share |
August 14 2020, 10:05 am

ఇంతగా వర్షాలు పడి.. దేవుడు ఈ సంవత్సరం మంచిగా నీళ్లు ఇచ్చినా రాయలసీమ ప్రాజెక్టులకు నింపుకోలేకపోవడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈసారి వర్షాలుబాగా కురిసినా ,వరదలు వచ్చినా, రాయలసీమలోని రిజర్వాయిర్ లను ఎందుకు నింపలేకపోయారని ప్రశ్్నించారు.దానిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు. ఇంత వర్షాలు పడుతున్నా ప్రాజెక్టులు నింపుకోకపోవడానికి గత చంద్రబాబు ప్రభుత్వమే కారణమని, ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పనులు చేపట్టకపోవడం, కాల్వల మరమ్మతులను పట్టించుకోకపోవండంతోనే ఈ దుస్థితి వచ్చిందనని జగన్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతుందని, కానీ, గత చంద్రబాబు ప్రభుత్వం గడిచిన పరిపాలనలో ప్రాజెక్టుల మీద శ్రద్ధపెట్టి చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే.. రాయలసీమలోని ప్రాజెక్టుల మరమ్మతులు పూర్తిచేసి.. కాల్వల సామర్థ్యాన్ని పెంచి ఉంటే.. ప్రతి బొట్టును ఒడిసిపట్టి ఉండేవాళ్లమని, రాయలసీమ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉండేవని అన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబును చూస్తే అసలు మనిషేనా అని అనిపిస్తోందని జగన్ అన్నారు. రామలసీమలోని ప్రాజెక్టులు మళ్లీ పుష్కలమైన నీళ్లతో కళకళలాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

tags : jgan, projects

Latest News
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info