A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కనుసన్నలలో ఆ పత్రికలు
Share |
January 19 2020, 10:45 am

ఈనాడు ,ఆంద్రజ్యోతి పత్రికలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కనుసన్నలలో నడిచే పత్రికలుఅని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు లక్షల మంది పరీక్షలు హాజరు అయ్యారని ఆయన చెప్పారు. ఆ రోజున ఆ పత్రికలు పరీక్షలు పకడ్బందీ గా జరిగాయని రాశాయని ఆయన అన్నారు. కాని తర్వాత ఫలితాలు వెల్లడైన అనంతరం ప్రశ్నాపత్రం లీక్ అంటూ కదనాలను ఆంద్రజ్యోతి రాయడం ఆరంబించిందని ఆయన అన్నారు.పరీక్షలు బాగా జరిగాయని చెప్పిన పత్రికలు ఆ తర్వాత ఇలా దుష్ప్రచారం చేశాయని ఆయన అన్నారు. దీనిపై ఎపిపిఎస్సి అదికారులు విచారణ చేశారని ,అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టంగా తేలిందని ఆయన అన్నారు.గ్రామ సచివాలయాలపై అసెంబ్లీలో మాట్లాడారు.మొదటి పదిహేను ర్యాంకులు వచ్చినవారిలో అధికులు బడుగువర్గాల వారేనని ఆయన వివరించారు.ఎస్సి,ఎస్టి ,బిసి కేటగిరిలకు చెందినవారు అధికంగా ఉత్తీర్ణులు అయ్యారని రామచంద్రారెడ్డి చెప్పారు.స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని పరీక్షలుఅద్బుతంగా జరిగాయని అభ్యర్దులే చెప్పారని అన్నారు. ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి జగన్ ది అని మంత్రి బదులు చెప్పారు.దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కి దుర్మార్గమైన లేఖ రాశారని ఆయన అన్నారు.

tags : peddireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info