A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సినీ నటుడి ఆత్మహత్యయత్నం
Share |
August 5 2020, 4:48 am

సినిమా తీయడం ఆలస్యం అది పైరసీ కావడమో, లేక యూట్యూబ్ లో ఎక్కేయడమో జరుగుతోంది. దీనివల్ల సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం వస్తోంది.నానిగాడు అనే సినిమా తీయగా, దానిని యూట్యూబ్ లో ఎక్కించి తీవ్ర నష్టం చేశారంటూ ఆ సినిమా హీరోగా నటించిన దుర్గా ప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. నలబై లక్షల ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఇలా అయింవదని, వెంటనే పిలిం చాంబర్ వారు యూట్యూబ్ లింక్ ను తొలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఆ క్రమంలో ఆయన తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఫిలించాంబర్‌ ఎదుట చిత్ర యూనిట్‌ మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. బుధవారం ఉదయం మరోసారి ఫిలించాంబర్‌ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

tags : hyderabad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info