A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కు జనసేన ఎమ్మెల్యే ఝలక్
Share |
January 24 2020, 9:46 am

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఝలక్ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం విదానాన్ని సమర్దిస్తూ మాట్లాడారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పెట్టడం ద్వారా బడుగు ,బలహీనవర్గాలవారికి ఎంతో ఉపయోగం జరుగుతుందని అన్నారు. మన ప్రాంతం నుంచి అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి కూలీ పనిచేసుకుంటున్నారని, అదే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉంటే మంచి ఉద్యోగాలు సంపాదించుకునేవారని ఆయన అన్నారు.ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం పెట్టడం మంచిదేనని ఆయన అన్నారు. ఇంతకాలం పవన్ కళ్్యాణ్ ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ను పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తన వైఖరి మార్చుకుని ఆంగ్ల ఈడియంతోపాటు తెలుగు మీడియం ఉండాలని అన్నారు. అయితే జనసేన ఎమ్మెల్యే మాత్రం తెలుగు మీడియం గురించి ప్రస్తావన చేయకుండానే ఆంగ్ల మీడియంను పూర్తిగా సమర్దించారు.

tags : janasena

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info