A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
Share |
August 5 2020, 3:35 am

వాగ్దానాల అమలులో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందన, ఐదేళ్ల తర్వాత హామీలు అమలుకు చంద్రబాబు ప్రయత్నం చేసినట్లు కనిపించారని,కాని జగన్ మాత్రం మొదటి ఆరు నెలల్లోనే హామీల అమలు చేశారని ఆయన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు అన్నారు.
కిలో 2 రూపాయల బియ్యాన్ని రూ. 5.25 చేసిన ఘనత చంద్రబాబుదేనని అప్పలరాజు విమర్శించారు. నాణ్యమైన బియ్యం పంపిణీని పలాస నుంచి మొదలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని గుర్తుచేశారు. ఎన్ని వేల కోట్లు రూపాయలు ఖర్చు అయిన ప్రభుత్వం పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తుందన్నారు. వాహనం వెళ్లలేని ఊరికి సైతం వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్లి బియ్యం తీసుకెళ్లి సరఫరా చేస్తున్నారని చెప్పారు.

tags : chandrababu, appalaraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info