A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అత్తగారికి కూడా మేమే పదవి ఇచ్చాం
Share |
August 5 2020, 4:48 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి అత్తగారికి కూడా తామే పదవి ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.తెలుగుదేశం ఎమ్మెల్యే సత్యప్రసాద్ వేసిన ఒక ప్రశ్నకు సమాదానం ఇచ్చారు. ఒకే సామాజికవర్గానికి సలహాదారులు తదితర పదవులు ఇచ్చారని, ఏబై శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.దానిపై ముందు మంత్రి కన్నబాబు సమాదానం ఇచ్చారు. ఈ క్రమంలో జగన్ జోక్యం చేసుకుంటూ తాము నామినేటెడ్ పోస్టులలో కచ్చితంగా ఎస్సి,ఎస్టి,బిసి,మైనార్టీలకు ఏభై శాతం పదవులు ఇస్తామని అన్నారు. క్యాబినెట్ లో అరవై శాతం మంది బలహీనవర్గాల వారు ఉన్నారని, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులలో నలుగురు బడుగువర్గాల వారు అని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు తన సలహాదారుగా కుటుంబరావును నియమించుకున్నారని ,అలా ఎందుకు చేశారని తాము అడగడం లేదని ఆయన అన్నారు. టిడిపి దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు బార్య అని, చంద్రబాబు అత్తగారు అని ,వారికి కూడా తామే పదవి ఇచ్చామని ఆయన అన్నారు.

tags : jagan,chadrnababu, posts

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info