A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్పీకర్ vs చంద్రబాబు
Share |
August 5 2020, 3:50 am

ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు, స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభాపతి స్థానానికి గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్ష నేత వ్యవహరిస్తున్నారని సీతారామ్ తీవ్రంగా స్పందించారు.సీతారామ్ ప్రతిపక్ష నేతకు తాను గౌరవం ఇస్తున్నానని, అయినా ప్రతిపక్ష నేత అనుచితంగా మాట్లాడుతున్నారని అన్నారు. కాగా చంద్రబాబు, స్పీకర్ మద్య ఆవేశం గా సంబాషణ సాగింది స్పీకర్ స్థానానికి మర్యాద లేకుండా చేస్తున్నారని చంద్రబాబు అనడాన్ని ఆర్దిక, శాసనసభ వ్యవభహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అబ్యంతరం చెప్పారు. కాగా తముకు అవకాశం ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ స్పీకర్ స్థానాన్ని చంద్రబాబు బెదిరిస్తున్నారని, స్పీకర్ ను కించపరిచే విదంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై అవసరమైతే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ బిసి వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్ గా ఉంటే ఓర్చు లేకపోతున్నారని ,బడుగు వర్గాలంటే అంత చులకన భావనా అని ఆయన అన్నారు.స్పీకర్ వ్యవస్థను ఖూనీ చేసింది చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు.సభ నుంచి చంద్రబాబు ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.చేయి చూపి అంతు చూస్తానని స్పీకర్ ను బెదిరిస్తారా అని ఆయన అన్నారు.

tags : ap, speaker

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info