A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
Share |
August 5 2020, 3:52 am

ఇంగ్లీష్ నేర్పించడానికి, మీడియం ప్రవేశ పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని ప్రతపిక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసిపి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆయన అన్నారు.తాను మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ ప్రవేశ పెడితే సాక్షిలో ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ ఎలా పెడతారని రాశారని ఆయన అన్నారు. మనది భాషా ప్రయుక్త రాష్ట్రం అని ఆయన అన్నారు. గురుకుల స్కూళ్లలో ఇంగ్లీష్ మాద్యమం ఉందని ఆయన అన్నారు.తాము ఇంగ్లీష్ కు వ్యతిరేకంగాదని, అయితే తెలుగు కూడా ఉండాలన్నది తమ విదానం అని ఆయన అన్నారు. తనకు ఇంగ్లీష్ రాదని ఎవరో చెప్పారని అంటున్నారని, తాను చేసిన అబివృద్ది చూశాక బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి వారు కూడా వచ్చారని ఆయన అన్నారు.తెలుగు మీడియం ద్వారా సంస్కృతి ,సంప్రదాయాలు రక్షించుకోవాలని, ఇంగ్లీష్ మీడియం కెరీర్ కు ఉపయోగమని ఆయన అన్నారు.

tags : chandrababu, english

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info