A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
Share |
January 19 2020, 10:50 am

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు వచ్చీరాని ఇంగ్లీష్ లో మాట్లాడి ఆంద్రప్రదేశ్ పరువు తీశారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో తెలుగు మీడియం పై టిడిపి సబ్యుడు బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలకు ఆయన బదులు ఇస్తూ ఈ వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డాక, మనవాళ్లు బ్రీఫ్ డ్ మి అంటూ మాట్లాడితే తెలంగాణ మంత్రి కెటిఆర్ ఇంత దరిద్రపు ఇంగ్లీష్ చంద్రబాబు తప్ప ఎవరూ కాదని అన్నారని ఆయన అన్నారు. ఇది వాస్తవం కాదా అని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న నారాయణకు ఆయన విద్యా సంస్థలకు పలు అనుమతులు ఇచ్చారని , వాటిలో ఒక్కటి కూడా తెలుగు మీడియం స్కూల్ ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తాను తెలుగులో పిహెచ్ డి పరీక్ష రాస్తే తెలుగు విద్యార్ది నేతలు తమపై పిర్యాదు చేశారని ఆయన అన్నారు.

tags : chevireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info