A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
Share |
January 19 2020, 9:39 am

ఈనాడు, ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా?గుడివాడలో రైతు బజార్ వద్ద సాంబిరెడ్డి అనే వ్యక్తి మరణించాడు.ఉల్లి కోసం వెళ్లి ఒకరు మరణించారని తెలుగుదేశం మీడియా ప్రచారం చేయడమే కాకుండా ఆ రెండు పత్రికల డెస్క్ ఇన్చార్జీలు ఆ కుటుంబం వారికి పోన్ చేసి ఉల్లి కోసం వెళ్లి సాంబిరెడ్డి మరణించాడని చెప్పాలని, అప్పుడు పాతిక లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తారని, చంద్రబాబు వస్తారని అన్నారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. అయితే అందుకు ఆ కుటుంబం అంగీకరించలేదని, తమను రాజకీయాలలోకి రావద్దని, తమకు ఉల్లి కోసం క్యూలో నిలబడవలసిన అవసరం లేదని వారు చెప్పారని,అంటూ దానికి సంబందించిన వీడియోను ఆయన అసెంబ్లీలో ప్రదర్శించారు.ఆ తర్వాత మీడియాతో కూడా సాంబిరెడ్డి కుమారుడు,బావమరిది మాట్లాడారని,అప్పుడు అక్కడకు ఈనాడు,ఆంద్రజ్యోతి వెళ్లలేదని ఆయన చెప్పారు. రాష్ట్రం అంతా తన జాగీరు అని చంద్రబాబు అనుకోవచ్చని, కాని అది గుడివాడ అని, అక్కడ ఉన్నది కొడాలని నాని అని ఆయన అన్నారు.

tags : ap,eenadu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info