A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
Share |
August 5 2020, 3:41 am

తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలోకి మారిన రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ పోలవరం ప్రాజెక్టుకు సంబందించి మాట్లాడిన తీరు చూడండి. అచ్చం టిడిపి ఎమ్.పి మాదిరి గానే మాట్లాడి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపునే పనిచేసినట్లు కనిపిస్తుంది.పోలవరం ప్రాజెక్టు గత ఏప్రిల్ నాటికి అరవై శాతం నుంచి డబ్బై శాతం పూర్తి అయిందని , ఆ తర్వాత పనులుఆగిపోయాయని ఆయన అన్నారు.అందుకు కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఉన్నట్టుండి నిర్మాణ సంస్థను మార్చేశారు. అది సీవీసీ నిబంధనలను అనుసరించి తీసుకున్న చర్యేనా అని కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రశ్నిస్తున్ననని అన్నారు. నిర్మాణ సంస్థ బాగా పనిచేస్తుంటే ఎందుకు మార్చినట్టు? బాగా పనిచేయకుండా నష్టం కలిగిస్తే... ఆ సంస్థ వల్ల కలిగిన నష్టం విలువ ఎంత? ఏ నష్టం జరగనప్పుడు నిర్మాణ సంస్థను ఎందుకు మార్చినట్టు?అని ఆయన అన్నారు. అయితే పోలవరంలో అవినీతి జరిగిందన్న అంశాల పై కాని ఇతరత్రా టిడిపికి ఇబ్బంది కలిగించే విషయాలు ఏమీ మాట్లాడకుండా రమేష్ ప్రసంగం చేయడం విశేషం.

tags : cm ramesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info