A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
24 లక్షల టన్నుల ఇసుక సరఫరా-ఎపి
Share |
May 27 2020, 2:21 pm

ఎపిలో ఇసుక అందుబాటు, వినియోగం తదితర అంశాలపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రకారం ఇంతవరకు దాదాపు 24 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.డిసెంబరు 1 వరకూ కొత్త విధానంలో రాష్ట్రంలో మొత్తం 23,81,716 టన్నుల ఇసుకను ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సరఫరా చేసింది. ఇందులో బల్క్‌ వినియోగదారులు 3,88,955 టన్నులు, సాధారణ వినియోగదారులు 19,92,761 టన్నుల ఇసుకను కొనుగోలు చేశారు. గత 20 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార తదితర నదులకు వరద రావడంతో నవంబరు రెండో వారం ముగిసే వరకూ రీచ్‌లన్నీ నీటిలోనే మునిగిఉన్నాయి. దీంతో ఇసుక తవ్వకాలు, రవాణాకు అవరోధం ఏర్పడడంతో కొంత మేర ఇసుక కొరత ఏర్పడింది. గత నెల రెండోవారం తర్వాత వరద తగ్గడం, నవంబరు 14 నుంచి ఇసుక వారోత్సవాలను నిర్వహించి చర్యలు తీసుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత నెల 16 నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత మాటే లేదు. అన్ని డిపోలు, స్టాక్‌ పాయింట్లలో ఇసుక నిండుగా ఉంది.
ప.గోదావరి జిల్లాలో అత్యధిక వినియోగం: పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా సాధారణ వినియోగదారులు 4,54,354 టన్నుల ఇసుకను కొనుగోలు చేయగా.. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 14,766 టన్నుల ఇసుక మాత్రమే బుక్‌ చేసుకున్నారు.

tags : sand

Latest News
*హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశా-బాబు
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info