లోక్ సభలో కూడా తెలుగుదేశం ఎమ్.పి గల్లా జయదేవ్ ఎపి లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నం చేయగా , వైసిపి నేత మిధున్ రెడ్డి అడ్డుకున్నారు. వీరిద్దరి మద్యరి మద్య వాగ్వాదం జరిగింది.పన్నుల సవరణ చట్టం చర్చలో జయదేవ్ పాల్గొంటూ ఎపి ప్రభుత్వం అనాలోచి నిర్ణయాల వల్ల పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, కొత్త పెట్టుబుడులు రావడం లేదని ఆరోపించారు.గత హయాంలో ఆదాయం పెరిగిందని ఆయన అన్నారు.మిధున్ రెడ్డి జోక్యం చేసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో పెరిగింది అవినీతేనని జవాబు ఇచ్చారు. ఏపీ గురించి ఎందుకు? ఇది అసెంబ్లీ కాదు.పార్లమెంటు. వాస్తవానికి టీడీపీ హయాంలో ఏపీలో పెద్దఎత్తున అవినీతి జరిగింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు క్షీణించాయి. దీనికి మీరు కారణం కాదా అని ఆయన అన్నారు. tags : midhunreddy