A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అర్జంట్ గా ఎన్నికలు కావాలంటున్న పవన్ కళ్యాణ్
Share |
November 30 2021, 7:36 am

అర్జంట్ గా మళ్లీ ఎన్నికలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తుండడం విశేసం.తిరుపతి రైతు బజార్ లో ఉల్లి కోసం వినియోగదారులు క్యూలో ఉండడంపై ఆయన స్పందించారు. ప్రజలను పాలించే సమర్దత వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు లేకపోతే అదికారం వదలివేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు.నాణ్యమైన ఉల్లి సరఫరా కావడం లేదని ఆయన అన్నారు. ఉల్లి కష్టాలు ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. భవంతులు కూలగొట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలపై పెట్టి ఉంటే బాగుండేదని ఆక్షేపించారు. ఇసుక కోసం ఎన్ని కష్టాలు పడ్డారో.. ఉల్లి కోసం ప్రజలు అంతే అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగ్గా, ఎపిలో మాత్రం పాతిక రూపాయలకే ప్రభుత్వం అందచేస్తున్న విషయాన్ని చెప్పకుండా ఏకంగా ఎన్నికల డిమాండ్ ను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info