A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిపిఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ పై ఫిర్యాదు
Share |
December 15 2019, 3:21 am

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌ భాస్కర్‌ పై కొందరు ఎమ్మెల్సీలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.ఉదయ భాస్కర్ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే తొలగించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. ప్రోగ్రెసివ్‌ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఏపీపీఎస్సీ, యూరేనియం తవ్వకాలకు సంబంధించిన అంశాలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లల్లో ఆయన తీరు వల్ల లక్షలాది అభ్యర్థులు అవస్థలు పడ్డారని విమర్శించారు. ఆయన ఇష్టానుసారంగా ప్రతి ఏడాది సిలబస్ మార్చేశారని మండిపడ్డారు.

tags : udayabhaskar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info