గతంలో జరిగిన సంఘటనల్లో పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతోనే వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి పై అత్యాచారం, హత్య వంటి సంఘటనలు జరుగుతునన్నాయని కాంగ్రెస్ ఎమ్.పి రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల నిఘా వైఫల్యం, ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డిని తక్షణమే విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఇప్పటికీ సంఘటనా స్థలాన్ని పరిశీలించలేదని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ ఘటన మీద తక్షణం స్పందించాలని అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారికి వెన్నులో వణుకుపుట్టే చర్యలు ప్రభుతం చేపట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సూచనమేరకు బాధిత కుటుంబసభ్యులను కలిశానని, పార్లమెంటులో సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని, బాధితుల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. tags : revanth