ఎపిలో చివరికి కొందరు దుండగులు పోలీస్ ల పేరుతో కూడా తప్పుడు సెల్ పోన్ నెంబర్లు ప్రచారం చేస్తున్నారట.దాని పై వచ్చిన కదనం ఆసక్తికరంగా ఉంది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
‘‘మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంచి సర్వీసు ప్రారంభించారు. మీరు ప్రయాణించే కారు, క్యాబ్ లేదా ఆటో నంబర్‌ను 9969777888కు ఎస్సెమ్మెస్ చేయండి. మీకు ఒక ఎస్సెమ్మెస్ వస్తుంది. మీరు ప్రయాణించే వాహనం జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానం అవుతుంది. మరికొంతమంది ఆడపడుచులకు ఈ సందేశాన్ని పంపండి’’ అయితే ఇదసలు పోలీసు శాఖ నంబరే కాదట. డిజిపి ఆఫీస్ దీనిపై ఒక ప్రకటన చేసింది. పోలీసు శాఖ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇందుకు కారకులైన వ్యక్తులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం పేర్కొంది. పోలీసు శాఖ విడుదల చేసిన నంబర్లు మినహా ఇతర నంబర్లకు ఫోన్ చేయడం లేదా ఎస్సెమ్మెస్ పంపడం వంటివి చేయొద్దని పోలీసులు కోరుతున్నారు. 100, 112, 181 నంబర్లకు మాత్రమే మహిళలు ఫోన్ చేయాలి. మహిళల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. అని కూడా వివరించారు. tags : ap, wrong cell numbers