జనసేన పార్టీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో చేసిన ప్రసంగాన్ని ఆ పార్టీ విడుదల చేసింది. దానిలో ముఖ్యమంత్రి జగన్ పై ద్వేషం వెళ్లగక్కడానికే ప్రాదాన్యం ఇచ్చినట్లుగా ఉంది.జగన్ నా మతం, నా కులం అని మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అన్ని కులాలను, మతాలను సమానంగా చూడాలి అని జనసేన అధ్యక్షులు పవన్
కళ్యాణ్ పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి గారు నా మతం, నా కులం అని
మాట్లాడుతున్నారనీ, మతం మార్చుకుంటే కులం ఉండరాదన్నారు. సోమవారం తిరుపతి,
చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలతో సమీక్షా
సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. క్రిస్టియానిటీ
అనుసరిస్తున్నాక కులం ఉండకూడదు. దురదృష్టవశాత్తు మన సమాజంలో అదే
కొరవడింది. నిజంగా మతం మీద విశ్వాసం ఉంటే చెట్టుకు కూడా హాని తలపెట్ట రాదు.
కానీ జగన్ రెడ్డి గారు చెట్లు నరికించేస్తారు. అన్నీ మారినా వైసిపి రంగులు
మాత్రం మారడం లేదు. వైసీపీది రంగుల రాజ్యం.
• దేశంలో ఒక్కో మతానికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది
సబరిబాలకు ఆడవారు వెళ్ల కూడదు అంటే ఎందుకు వెళ్ల కూడదు అన్నది కోర్టులో
వేశారు. 30 ఏళ్ల క్రితం కేరళ హైకోర్టు ఇది కోర్టు పరిధిలోకి రాదు.. ఒక్కో
ధర్మానికి ఒక్కో పద్దతి ఉంటుందని కేసు కొట్టేస్తే ఇప్పుడు అదే కేసు సుప్రీం
కోర్టులో వచ్చింది. అది మత విశ్వాసాలతో కూడుకున్న వ్యవహారం. నా భార్య
శబరిమల గొడవ గురించి అడిగితే తను చర్చికి వెళ్లినప్పుడు ముసుగు వేసుకున్న
విషయాన్ని ప్రస్తావించి అర్ధమయ్యేలా వివరించా. భారత దేశంలో ఉండే ఒక్కో
ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుంది. అయ్యప్పస్వామి బ్రహ్మచారి తపస్సులో
ఉంటాడు ఎవర్నీ చూడరు.. అది ఆయన పెట్టుకున్న నియమం. తిరుమలలో దర్శనం
అవలేదని బాధతో కూర్చుంటే స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి భుజం
తట్టాడని... భక్తి ఉంటే భగవంతుడే నీ దగ్గరకు వస్తాడని పురాణాలు
చెబుతున్నాయి. అలాంటి
పరిస్థితుల్లో రెచ్చగొట్టే పనులు చేస్తే గొడవలు అవుతాయి. సమస్య జఠిలం
అవుతుంది మినహా పరిష్కారం కాదు. మక్కాకి, కడప దర్గాకు వెళ్లి అక్కడ
సంప్రదాయాన్ని గౌరవించినట్టే శబరిమల సంప్రదాయాన్ని గౌరవిస్తాం.
వాటికన్ సిటీకి వెళ్లి హరే రామ అని భజన చేయం కదా. ఏడుకొండల వాడి దగ్గర అదే
సంప్రదాయాన్ని గౌరవించాలి. గౌరవించకపోతే గొడవలు అవుతాయి. రాజ్యాంగం
స్వేచ్ఛ ఇచ్చింది కదా అని ఎలా పడితే అలా చేయకూడదు. తిరుమలని గౌరవించాలి.
అక్కడ అన్య మత ప్రచారం జరగ కూడదు దాన్ని నేను సమర్ధిస్తా. సత్యాన్ని
మాట్లాడేటప్పుడు రాజ్యాంగం పరిధిలో మాట్లాడి తీరాలి. అని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నది ఆయనకైనా అర్దం అవుతుందా?
• tags : pawankalyn