జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రకటన భలేగా ఉంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జనసేనకు భయపడుతోందని ఆయన చెబుతున్నారు. జనసేన గుండె బలానికి వైసిపి ప్రభుత్వం భయపడుతోందని తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో అన్నారు. రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులు వచ్చినా , ఆ ప్రాంతం వెనుకబడి ఉందని ఆయన అన్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రతిపనికి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా వెళుతోందని ఆయన అన్నారు. రాయలసీమలో రైతులకు శీతల గిడ్డంగులు కట్టలేకపోయారని ఆయన ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది సిమెంట్ పరిశ్రమలు పెట్టుకునేందుకు కాదన్నారు. ఇక్కడ నేతలకు పచ్చటి పొలాలు ఉన్నాయని.. పేదలు మాత్రం పొట్టచేత పట్టుకుని వలసలు వెళ్తున్నారని చెప్పారు. ఏడుకొండలకు తప్ప ప్రతిదానికీ వైకాపా రంగులు వేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. tags : pawankalyan