A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పై చంద్రబాబు విచిత్ర వ్యాఖ్య
Share |
December 15 2019, 3:56 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు భలే ఆరోపణ చేశారు. ఎపి ప్రభుత్వం కూర్చుంటే కేసు, నుల్చుంటే కేసు పెడుతోందని ఆయన చెబుతున్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టి ఉంటే వైసిపి ఉండేదా అని ఆయన అంటున్నారు. టిడిపి కార్యకర్తలపై 690 కేసులు పెట్టారని తాజా లెక్క చెబుతున్నారు.తమ కార్యకర్తలపై దాడులు చేశారని ఆయన ఆరోపించారు. కర్నూలు లోజరిగిన పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఇన్ని సంవత్సరాలలో విచిత్రమైన నేతగా జగన్ ను చూస్తున్నామని ఆయన అన్నారు.సచివాలయ ఉద్యోగాలు తొంభై శాతం వైసిపి కార్యకర్తలకే ఇచ్చారని ఆయన అన్నారు. తన ఇల్లు ముంచడానికే శ్రీశైలం, సాగర్ లలో నీరు పెట్టి విడుదల చేశారని చంద్రబాబు అన్నారు.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తాను పట్టుబట్టానని కూడా చంద్రబాబు చెప్పారు.

tags : chandrababu, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info