A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా మతం, కులం ఇవే-జగన్ సమాధానం
Share |
December 15 2019, 4:00 am

నా మతం మానవత్వం ..నా కులం మాట నిలబెట్టుకునే కులం ..అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. కొన్ని రాజకీయ పక్షాలు,కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు దుష్్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకునేందుకు తాపత్రయ పడుతున్నానని ఆయన అన్నారు.అందుకే పేదలు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకుని, విశ్రాంతి లేకుండా మళ్లీ పనులకు వెళ్లే పరిస్తితి కాకుండా ,వారు పూర్తిగా కోలుకోవడం కోసం ఈ పకదం అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకున్న సమయంలో వారు పస్తులు ఉండకుండా ఈ స్కీమ్ అమలు అవుతుందని ఆయన అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆసరా స్కీమ్ ను ప్రాంబించారు. డాక్టర్ లు,నిపుణులు సిఫారస్ చేసిన ప్రకారం ఆరోగ్యశ్రీ చికిత్సపొందినవారికి రోజుకు 225 రూపాయలు చొప్పున ,నెలకు ఐదువేల వరకు ఇస్తామని ఆయన చెప్పారు. తాను పాదయాత్రలో నేను విన్నాను..నేను ఉన్నాను..అని మాట చెప్పాను ..దానిని నిలబెట్టుకుంటున్నానని జగన్ అన్నారు.ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని ఆయన అన్నారు.

tags : religion caste

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info