A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోక్ సత్తా అదినేత కారు కు ప్రమాదం
Share |
December 15 2019, 3:31 am

లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. అయితే ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆయన కారు టైర్ పంచర్ అవడంతో అదుపు తప్పుతుండగా, డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాంతో కారు ఒక ఆటోని డీకొట్టిందని సమాచారం వచ్చింది. హైదరాబాద్ కెబిఆర్ చౌరస్తా నుంచి జూబ్లిహిల్స్ వైపు వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి.ఆ తర్వాత ఆయన కారు దిగి ,ఆటోలోవారితో మాట్లాడి ,వారికి ఇబ్బంది లేదని తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు.

tags : jp,accident

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info