ప్రజల మద్దతు తమకే ఉన్నప్పట్టికీ రాజకీయ అంకెల గణితంలో ఓడిపోయామని మహారాష్ట్ర మాజీముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర పడ్నవీస్ అన్నారు.ఎన్నికలలో బిజెపి అతిపెద్ద పార్టీగా వచ్చిందని, కాని రాజకీయ లెక్కల్లో ఓడిపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు కాలేదని ఆయన అన్నారు. అయితే కార్యకర్తలు ఓర్పుతో ఉండాలని అన్నారు. మళ్లీ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ధీమాను ఆయన కనబరిచారు.కాకపోతే కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.డెబ్బైశాతం మార్చులు వచ్చినవారికి బదులు 40 శాతం మార్కులు సాధించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాస్వామ్యంలో మేం భాగస్వాములం కాబట్టి దాన్ని మేం అంగీకరిస్తున్నామని ఆయన అన్నారు. tags : devendra