A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమ జగన్ ఒక్కరిదే కాదు- పవన్ కళ్యాణ్
Share |
June 2 2020, 4:24 pm

రైల్వే కోడూరులో స్థలం అడిగింది ఇల్లు కట్టుకోవడానికి కాదు. పెద్ద
గ్రంథ్రాలయం ఏర్పాటు చేయడానికి. ఇది ఫ్యాక్షన్ సీమ కాదు. చదువుల సీమ.
అలాంటి సీమలో మీకు పిరికితనం ఆవహించడం ఏంటి?. జ్ఞానం ధైర్యాన్నిస్తుంది.
మీలో జ్ఞానాన్ని నింపేందుకు ఇక్కడ పెద్ద గ్రంథాలయం కడతాను..అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కోడూరులో జరిగిన సబలో ఆయన మాట్లాడారు.లైబ్రరీ ఇక్కడికి
వచ్చినవారంతా వచ్చి చదువుకునేంత పెద్దదిగా ఉంటుంది. జ్ఞానం అనే ఖడ్గంతో
పిరికితనాన్ని చంపాలి. జనసేన పార్టీ పెట్టినప్పుడు అందరికీ ఎన్ని ఓట్లు
పడతాయి. ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు. సమాజాన్ని ఆవహించిన
పిరికితనాన్ని పారద్రోలాలన్న లక్ష్యంతో వచ్చాను. తెల్లచొక్కా
పంచెకట్టుకున్న వారికే పనులు జరిగితే ఎలా. సంపద కొద్ది మందిదే కాదు. సీమ ఒక్క
జగన్ రెడ్డి గారిదే కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చీని
చెట్లు నరికేస్తాం, అవసరం అయితే మనల్ని కూడా నరికేస్తాం అన్న భయం
కలిగిస్తున్నారు.

* నాయకుల పొలాలు పచ్చగా
మన దేశంలోనే సీమలోని కొన్ని జిల్లాల్లో వర్షపాతం తక్కువ. నేను రాయలసీమ
పర్యటనలో చూస్తే నాయకులు ఉన్న చోట పొలాలు పచ్చగా ఉన్నాయి. సామాన్యులు
ప్రజల భూములు ఎండిపోవడం బాధ కలిగించాయి..చాలా సార్లు రాయలసీమకు
వచ్చినప్పుడు ఇంత మంది యువత ఉన్నారు. నేను వచ్చినప్పుడు ఇక్కడ చూసిన ఆవేదన,
కోపం, పౌరుషం, కడుపు మంట కనబడుతూ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో అది పిసరంత
తక్కువే ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఎందుకు కోపంతో ఉన్నారంటే.. నిజానికి ఇక్కడ కరువు
లేదు. సృష్టించబడింది. రాయలవారు ఏలిననాడు తటాకాలు, చెరువులు పెట్టి కాలువలు
తవ్వించి, అప్పుడు సశ్య శ్యామలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు పండవు.
ఇక్కడున్న నాయకత్వం లోపమే అది. రాయలసీమ నుంచి జగన్ రెడ్డి గారితో సహా
ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తే ఎందుకు వెనుకబాటు ఉంది? అంటే ఇక్కడ
ప్రజాస్వామ్యాన్ని చంపేసే పరిస్థితులు ఎక్కువ. అన్ని ప్రాంతాల్లో ప్రజలు
నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తారు. నాయకులు ఇక్కడిలా ఇళ్లలోకి వచ్చి ధ్వంసాలు
చేయరు. నాయకులకు ఎదురు తిరిగితే మన ఇళ్ల మీద దాడులు చేస్తారు, చెట్లు
నరికేస్తారు అన్న ధోరణి మారాలి.
మాట్లాడితే సినిమాల్లో సీమ సంస్కృతి అంటే నరకడం అని చెబుతారు. అదే సీమ
సంస్కృతి అయితే ఇన్ని పంటలు ఎందుకు పండుతున్నాయి? అభివృద్ధి చెందిన
కాలిఫోర్నియాతో రైల్వే కోడూరును ఎందుకు పోలుస్తున్నారంటే అంత సారవంతమైన
నేల ఇక్కడా ఉంది. ఏ పంట వేసినా పండుతుంది. అయితే ఫలితం ఎవరికి వస్తుంది అన్నదే
ప్రశ్న. అని ఆయన అన్నారు.

tags : pawankalyan

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info