A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ నిజంగానే అర్దం పర్దం లేకుండా...
Share |
December 12 2019, 9:44 am

రైల్వేకోడూరు రైతుల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాస్తానని
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చెట్లు నరికే
వాళ్లకి, ఆడబిడ్డలను ఉరి తీసి చంపే వాళ్లని వెనకేసుకొస్తున్న వాళ్లకి పతనం
మొదలైందని హెచ్చరించారు. జనసేన కార్యకర్తల మీద దాడులు చేస్తే చేతులు
కట్టుకుని చూస్తూ ఊరుకోమని, దాడికి ప్రతిదాడి చేయకపోతే చంపేస్తారన్న
బోస్ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న వాడిగా రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలో అది
చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ పర్యటనలో భాగంగా కడప జిల్లా రైల్వే
కోడూరులోని శ్రీలక్ష్మీ ప్యారడైజ్ హాల్లో రైతు సమస్యలపై ఏర్పాటు
చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు
మాట్లాడుతూ..సగటు రైతులు, ఆడపడుచులకు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ మీ
తరఫున పోరాటం చేస్తుంది. రాయలసీమ యాత్ర పూర్తయ్యాక సీమ రైతుల
సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తా. మోడీ గారితో కలసి మొదట
నిజామాబాద్ లో వేదిక పంచుకున్నప్పుడు పసుపు బోర్డు కావాలని అడిగితే ఇస్తామని
మాటిచ్చారు. ఆ తర్వాత అక్కడ గెలిచిన ఎంపీ దాన్ని సాధించలేకపోయారు.
* న్యాయం కోసం కన్నతల్లే లాయరయ్యింది
ఈ రోజు ఎయిర్ పోర్టులో దిగి బయటకు వచ్చాక ఓ యువతి ప్ల కార్డు ఇచ్చింది. ఆడ
బిడ్డలకు రక్షణ కల్పించేలా పోరాడమని కోరింది. హైదరాబాద్ లో చోటు చేసుకున్న
ఘటన బాధాకరం. 2017లో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి
రెసిడెన్షియల్ స్కూళ్లో తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని ఒక
తల్లి చెబితే కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. ఆ కేసును జగన్ రెడ్డి గారు ఎందుకు
బయటికి తీయడం లేదు. వాళ్లను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు
ఏంచేస్తున్నారక్కడ... వాళ్లకు లేరా ఆడబిడ్డలు, రాజకీయ నాయకులకు లేరా
ఆడబిడ్డలు.. ఆ ఆడబిడ్డను చంపేసిన వెధవలకు లేరా ఆడబిడ్డలు... అడిగేవాళ్లు
లేరా?. అని ఆయన అన్నారు.
..................
ఆడబిడ్డలకు అన్యాయం చేసినవారిని,చెట్లు నరికినవారిని ఎవరు సమర్దిస్తున్నారు? ఏమిటో పవన్ కళ్యాణ్ మాటలు నిజంగానే అర్దంకావడం లేదు!

tags : pawankalyan

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info