A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ మాటలు ప్రజలకు అర్దం కావడం లేదు
Share |
December 15 2019, 4:07 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై ప్రబుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు మండిపడ్డారు.పవన్‌ కళ్యాణ్‌ ఒక అజ్ఞాని, చేతకాని దద్దమ్మ అని ఆయన ద్వజమెత్తారు. రైల్వేకోడూరులో రైతు సంక్షేమం.. జనసేన ధ్యేయం పేరిట పవన్‌ ఎందుకొచ్చాడో ఏమి మాట్లాడుతున్నాడనేది ప్రజలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడిందన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబుకు దత్తపుత్రుడిగా ఉన్నాడని, ఆరోజు వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటే ఏమీ మాట్లాడకుండా ఎక్కడికి పారిపోయావని పవన్‌ను ప్రశ్నించారు. ప్యాకేజీ ఎవరు ఇస్తే వారి మాట మాట్లాడే గుణం మొదటి నుంచి పవన్‌కు ఉందని శ్రీనివాసులు అన్నారు.

tags : koramutla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info